పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు

12 Dec, 2020 09:02 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం:  పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కెళ్లిన క్రూర చర్య సోషల్‌మీడియాలో  వైరల్‌గా మారింది. అదీ 62 ఏళ్ల  ఒక పెద్దాయన కనీసం కనికరం లేకుండా  దారుణంగా  ప్రవర్తించిన వైనంపై నెటిజన్లులు మండిపడుతున్నారు.  కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది.

 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను బాగి విసిగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన  యూసఫ్ ఆప్రాంతం నుండి కుక్కను దూరంగా తీసుకెళ్లి వదిలిరావాలని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించకుండా.. ఏ మాత్రం దయ లేకుండా కుక్కను కారుకు కట్టేసి మరీ లాక్కెళ్లిపోయాడు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు.  ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన  యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు.  అయితే...నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్‌ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై  వ్యవహారంపై అఖిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు కారు  యజమాని యూసుఫ్‌పై  చెంగమండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే (ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేసి బెయిల్‌పై  విడుదల చేశామని  పోలీసు అధికారి తెలిపారు.  గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు