నటుడు, ఎంపీపై కేసులు పెట్టిన భార్య

20 Dec, 2020 19:26 IST|Sakshi
నటుడు, బిజు జనతా దళ్‌ ఎంపీ అనుభవ్‌ మొహంతి

భువనేశ్వర్‌ : నటుడు, బిజు జనతా దళ్‌ ఎంపీ అనుభవ్‌ మొహంతిపై ఆదివారం గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. భార్య, నటి వర్ష ప్రియదర్శి ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుభవ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అనుభవ్‌, అతడి స్నేహితులిద్దరు తనను కటక్‌లోని తమ నివాసంలోని ఓ గదిలో బంధించారని, పోలీసులు సహాయంతో బయటపడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, గతంలో కూడా పలుమార్లు భర్తపై ఆమె కేసులు పెట్టారు. కొన్ని నెలల క్రితం.. అనుభవ్‌, వర్ష గొడవపడుతున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా.. భర్త తన క్యారెక్టర్‌ను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ( స్నేహితులతో కలిసి భార్యపై అత్యాచారం )

అనుభవ్‌ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆగస్టు 7న కోర్టులో గృహహింస కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అనుభవ్‌ తనకు భార్యనుంచి విడాకులు కావాలంటూ ఢిల్లీలోని పటియాలా కోర్టుకెక్కారు. అయితే తమ విడాకుల కేసును కటక్‌ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసు నేపథ్యంలో అనుభవ్‌ డీజీపీకి ఓ లేఖ రాశారు. ‘‘ నాకు, నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది. దయచేసి మమ్మల్ని కాపాడండి’’ అని లేఖలో పేర్కొన్నాడు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు