చోక్సీకి  కోర్టులో ఎదురుదెబ్బ

12 Jun, 2021 13:25 IST|Sakshi

 బెయిల్‌ తిరస్కరించిన డొమినికా హైకోర్టు 

సాక్షి,న్యూఢిల్లీ: పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్‌ తగిలింది.  క్యూబాకు  పారిపోతూ  డొమినికాలో  అరెస్ట్‌ అయిన చోక్సీకి  డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని  అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే  చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా  ఉందని  న్యాయవాది లారెన్స్  వాదించారు. 

కాగా పీఎన్‌బీ బ్యాంకులో 13,500 కోట్ల రూపాయల స్కాం కేసులో నిందితుడగా ఉన్న చోక్పీ 2018లో అంటిగ్వాకు పారిపోయిన సంగతి తెలిసిందే. మెహుల్‌ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని అనుభవిస్తున్న చోక్సీ మే 23న  ఆంటిగ్వానుంచి పారిపోతూ డొమినికాలో అరెస్టయ్యాడు. దీంతో అక్కడ విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు చోక్సీని అక్రమ వలసదారుగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

చదవండి :  చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌ : మరో ట్విస్టు
క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్‌

మరిన్ని వార్తలు