కోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలు 

11 Dec, 2022 19:28 IST|Sakshi

రంగంలోకి దిగిన మధ్యవర్తులు

విశాఖ, విజయవాడ కేంద్రంగా పైరవీలు జరుగుతున్నట్టు ప్రచారం

ఒక్కో పోస్టుకు రూ. 3లక్షల నుంచి  రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్టు వినికిడి

మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా జడ్జి సూచన

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసా లు జరుగుతున్నాయి. ఒక్కో పోస్టుకు స్థాయి మేరకు రూ. 3లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వసూలుకు దిగినట్టుగా ప్రచారం నడుస్తోంది. విశాఖపట్నం, విజయవాడకు చెందిన వ్యక్తులు పైరవీలు చేస్తున్న ట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదవ్వడంతో ఇప్పటికే పోలీసు వర్గాలు అప్రమ త్తమయ్యాయి. తాజాగా జిల్లా జడ్జి కూడా స్పందించారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరుగుతా యని, దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులో పలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లా కోర్టుల్లో 3,432 పోస్టులు, హైకోర్టులో 241 పోస్టులు భర్తీ చేస్తున్నా రు. వీటికి సంబంధించి ఈనెల 21న, వచ్చే నెల 2వ తేదీన రాత పరీక్ష కూడా జరగనుంది. అయితే, ఇదే అవకాశంగా దళారులు చెలరేగిపోతున్నారు. ఎక్క డైనా నియామకాలు జరిగితే చాలు బ్రోకర్లు రంగంలోకి దిగి క్యాష్‌ చేసుకుంటున్నారు. సులువుగా ఉద్యోగాలు వచ్చేయాలన్న ఆశతో ఉన్న నిరుద్యోగులను ట్రాప్‌ చేస్తున్నారు.

వీలు చిక్కినంత వసూలు చేసి ఆ తర్వాత చేతులేత్తేసిన పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ఎవరికైనా ఉద్యోగం వస్తే అది మా చలవేనని, రాకపోతే రాలేదని కొందరు దళారులు చేతులెత్తేస్తుండగా, మరికొందరు వసూలు చేశాక పత్తా లేకుండా పోతున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిణామాలు ఉద్యోగాల నియామకాలు జరిగిన ప్ర తి సారి జరుగుతున్నాయి. చెప్పాలంటే మధ్యవర్తుల దందా నిత్యకృత్యమైపోయింది. ఇప్పటికే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసులు అనేకం జిల్లాలో ఉ న్నాయి. నిరుద్యోగుల అమాయకత్వంతో వీరు ఆడుకుంటున్నారు. తాత్కాలిక, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు సైతం మోసాలకు పాల్పడుతున్నారు.  

ఇటీవల అంగన్‌వాడీ తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసగించిన కేసు వెలుగు చూసింది. శ్రీకాకుళం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏకంగా ఒక దళారిని బాధిత నిరుద్యోగులే పట్టుకుని పోలీసులకు అప్ప గించారు. చెప్పుకుంటూ పోతే జిల్లాలో అనేక ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కోర్టు ఉద్యోగాల మో సాలు కూడా ప్రచారంలోకి రావడంతో పోలీసు వర్గాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా  కోర్టు ఉద్యోగాల మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 15 కేసులు నమోదైనట్టు సమాచారం. ఇటీవల పెనమలూరులో ఒకర్ని పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఇదే సమయంలో కోర్టు వర్గాలు కూడా తీవ్రంగా పరిగణించి అప్రమత్తం చేస్తున్నాయి. తాజాగా జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా కూడా స్పందించి, నిరుద్యోగులను అప్రమత్తం చేస్తూ పిలుపునిచ్చారు.

మోసపోవద్దు 
రాష్ట్రంలోని కోర్టుల్లో వివిధ కేడర్ల ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా జరుగుతున్నా యి. ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దు. అర్హతే ప్రామాణికంగా, మెరిట్‌ ఆధారంగా తీసుకుని నియామకాలు జరుగుతున్నా యి. ఉద్యోగాలు వేస్తామని ఎవరైనా చెబితే పోలీసులను ఆశ్రయించండి. లేదంటే మా దృష్టికి తీసుకురండి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన వారి మాయ మాటలు నమ్మవద్దు.  
– జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

మరిన్ని వార్తలు