పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం!

6 Apr, 2021 21:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరుమలగిరి (నాగార్జునసాగర్‌): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని కొంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శ్రీరాంపల్లి గ్రామానికి చెందిన  పోలోజు శ్రీనివాసచారి, కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. రెండో కుమార్తె  బొడ్డుపల్లి మాధవి(26) మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మహేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు.

ఈమె భర్త మహేష్‌ హాలియాలో ట్రాక్టర్‌ వెల్డింగ్‌ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా,  భార్యభర్తల మధ్యతరుచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన వారి పెళ్లిరోజు వేడుకలను భార్యభర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారే సరికి బొడ్డుపల్లి మాధవి మృతిచెందింది.  కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.  మృతురాలి వంటిపై గాయాలు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు