రూ. 31 కోట్ల విలువైన తిమింగలం అంబర్‌గ్రిస్‌ స్వాధీనం

20 May, 2023 16:57 IST|Sakshi

చెన్నై: అంతర్జాతీయ మార్కెట్‌లో లో కోట్ల రూపాయల విలువైన తిమింగలం వీర్యం (అంబర్‌గ్రిస్‌)ను డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. దీన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న నలుగురు సభ్యులతో కూడిన ముఠాను సైతం అదుపులోకి తీసుకున్నారు.  దీని విలువ రూ. 31.6 కోట్లు ఉంటుందని అంచనా.  అత్యంత విలువైన అంబర్‌గ్రిస్‌ను సముద్రమార్గంలో తరలించే క్రమంలో సమాచారం అందుకున్న అధికారులు టుటికోరిన్‌ సీ కోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. 

విదేశాల్లో భారీ డిమాండ్
తిమింగలాలు చేపలు తినే సమయంలో దాని వీర్యం బయటకు విసర్జిస్తుంది. దీనికి విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. తమింగలాలు ఎక్కువగా వాటి వీర్యం విసర్జించిన  కొన్ని గంటల తరువాత ఆ వీర్యం రాయిలాగా మారిపోయి సముద్రంలోని నీటిలో తేలుతుందట.

ఔషధాలు, సుగంధ ద్రవ్యాల్లో వినియోగం
ఔషదాలు, సుగంధద్రవ్యాలు అంబర్‌గ్రిస్‌ను ఎక్కువగా ప్రయోగాల కోసం, ఔషదాలు, సుగంధద్రవ్యాలు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారట. ఇది అత్యంత విలువైనది కావడంతో స్మగ్లర్లు అత్యంత చాకచక్యంగా దీన్ని విదేశాలకు తరలిస్తూ ఉంటారు. అలా తమిళనాడు నుంచి విదేశాలకు తరలించే క్రమంలోనే ఆ స్మగ్లింగ్‌ ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు