రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్‌టీ సమన్లు

20 Jun, 2022 07:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ కేశినేని నానికి డెట్స్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ) సమన్లు జారీ చేసింది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేశినేని సంస్థల నుంచి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసుకోవడానికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విశాఖ డీఆర్‌టీని ఆశ్రయించింది.

దీంతో జూలై 11వ తేదీ ఉదయం 10.30లోగా నేరుగా లేదా లాయర్ల ద్వారా వివరణ ఇవ్వాలని.. లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్‌టీ స్పష్టం చేసింది. కేశినేని నానితో పాటు కేశినేని పావని, కేశినేని కార్గో అండ్‌ కారియర్స్‌ లిమిటెడ్‌లకు కూడా పత్రికా ప్రకటన ద్వారా డీఆర్‌టీ సమన్లు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు