బంజారాహిల్స్‌: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..

5 Sep, 2021 09:00 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు 

డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

సాక్షి, బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌  రోడ్‌ నెం.14లో డ్రగ్స్‌తో పాటు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హైదరాబాద్‌ టీమ్‌ అరెస్ట్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌ ప్రశాంత్‌నగర్‌లో మార్ధి శివశంకర్‌ రెడ్డి(26), బల్కంపేట తులసీ నగర్‌ జయప్రకాశ్‌ నగర్‌లో నివసించే గంధం మణికంఠ(26), వెస్ట్‌బెంగాల్‌ డార్జిలింగ్‌కు చెందిన శిల్పారాయ్‌(27) ముగ్గురూ కలిసి కొంత కాలంగా అవసరమైన వారికి డ్రగ్స్‌తో పాటు గంజాయి విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వీరిని బంజారాహిల్స్‌లో అరెస్ట్‌ చేశారు.

ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి ఈ డ్రగ్స్‌ను, గంజాయిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. ఈ ముగ్గురినీ అరెస్ట్‌ చేసి వీరి నుంచి పెద్ద ఎత్తున గంజాయితో పాటు డ్రగ్స్‌ను, మొబైల్‌ ఫోన్స్, మో టార్‌ బైక్‌లను సీజ్‌ చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌ఏ అజయ్‌రావు ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అంజిరెడ్డి, సీఐ పి.నరేందర్, ఎస్‌ఐ నజీర్‌ హుస్సేన్, కానిస్టేబుల్‌ భాస్కర్‌రెడ్డి, అజీమ్, శ్రీధర్‌ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. 
చదవండి: ఊరికెళ్లే విషయంలో యువ దంపతుల గొడవ.. ఉదయం లేచేసరికి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు