డ్రగ్స్‌ కేసు; హాస్యనటికి బెయిల్‌

23 Nov, 2020 20:09 IST|Sakshi
భారతీ సింగ్‌, హర్ష లింబాచియా (ఫైల్‌)

డ్రగ్స్‌ కేసులో భారతీ సింగ్‌ దంపతులకు బెయిల్‌

బెయిల్‌ మంజూరు చేసిన ముంబై కోర్టు

ముంబై: బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్‌ దుమారం హిందీ చిత్రసీమలో కల్లోలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన హాస్యనటి భారతీ సింగ్‌, తమె భర్త హర్ష లింబాచియాలకు బెయిల్‌ లభించింది. ముంబై కోర్టు సోమవారం వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారం వీరి ఇంటి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, భారతీ సింగ్‌తో పాటు లింబాచియాను శనివారం అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో మత్తుమందులు వాడుతున్నవారికి భయం మొదలైంది. స్టార్‌ హీరోయిన్ల దగ్గర నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు వరకు ఈ వరుసలో ఉన్నారు. ఇటీవల నటుడు ఆర్జున్‌ రాంపాల్‌కు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో నటులు అరెస్టు కావడం నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తీరని నష్టాల మధ్య ఈ భారం మరింత పెరిగిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు ఎంత మొగ్గుచూపుతారని అర్థంకాకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

జూన్‌ నెల నుంచి బడా హీరోయిన్లు ఎన్‌సీబీ కార్యలయం చుట్టూ తిరుగుతున్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మొదలుకొని దీపికా పదుకునే వంటి ఆగ్ర కథానాయికులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇప్పటికే దీపికా విచారణకు రెండుసార్లు ముంబైలోని ఎన్‌సీబీ కార్యలయానికి హాజరయ్యారు. సుశాంత్‌ మృతి కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి బైకుల్లా జైలునుంచి బెయిల్‌ పై విడుదల అయ్యారు. ఈ నటిపై సుశాంత్‌తండ్రి అనేక ఆరోపణలు చేశారు. వీటి నడుమ డ్రగ్స్‌ కేసులో వీరి హస్తం ఎక్కువగా ఉందని తెలియడంతో అధికారులు విచారణ వేగవంతం చేసి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం మొదలు పెట్టారు. (చదవండి: అది నా సినిమా టైటిల్‌.. ఇచ్చేయ్‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా