మద్యం మత్తులో దాడి.. అవమానంతో ఆత్మహత్య

28 Jul, 2020 13:57 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మద్యం మత్తులో కొందరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. వారు చేసిన దాడిని తీవ్ర అవమానంగా భావించిన ఆ వ్యక్తి ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన బండపల్లి శీను అదే గ్రామానికి చెందిన దాసరి శబరి అనే యువకుడు మద్యం మత్తులో శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంటి పైకి వెళ్లి అందరు చూస్తుండగానే చితకబాదారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌ ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఆ రోజు శీనివాస్‌పై దాడి చేస్తున్న దృశ్యాలను మరో స్నేహితుడు సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. దాడికి సంబంధించిన వీడియో ఆలస్యగా బయటకు రావడంతో ఆ యువకులు శ్రీనివాస్‌ను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విచక్షణ రహితంగా కొట్టి పైశాచిక ఆనందం పొందిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు