ఫుల్‌గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు!

18 Sep, 2022 20:17 IST|Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): కరూర్‌ జిల్లాలో మద్యం మత్తులో స్నేహితుడిపై ఆటో ఎక్కించడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కరూర్‌ జిల్లా తోగైమలై సమీపం కన్నైకలై పంచాయతీ సుక్కాంపట్టికి చెందిన శరవణన్‌(35) లోడు ఆటోలో దుకాణాలకు నీళ్లను సప్‌లై చేస్తున్నాడు. అతని స్నేహితుడు పుట్టూర్‌ పంచాయతీకి చెందిన వెంకటతాంపట్టికి చెందిన కుమరిముత్తు (24). ఇతను ఆ ప్రాంతంలో సెలూన్‌ నడుపుతున్నాడు.

శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సుక్కాంపట్టి, కులందైపట్టికి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు. ఈ సమయంలో శరవణన్‌ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు ఆటోను శరవణన్‌ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్‌ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శరవణన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మారిముత్తుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై స్పందించిన పోలీసులు.. వీడియో పంపింది అతనికే!

మరిన్ని వార్తలు