మద్యం మత్తులో స్నేహితుని ఇంటికెళ్లి..

5 May, 2022 16:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హోసూరు(బెంగళూరు): మద్యం మత్తులో స్నేహితుని ఇంటికెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఉత్తర ప్రదేశ్‌కి చెందిన చంద్రబలి (42) హోసూరు సమీపంలోని అచ్చంద్రం ప్రాంతంలో ఉంటూ వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు. మంగళవారం మద్యం మత్తులో మిత్రుని ఇంటికెళ్లిన చంద్రబలి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహిళా పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసుకొని నిందితున్ని అరెస్ట్‌ చేశారు. 


మరో ఘటనలో..
యువకుడు ఆత్మహత్య 
క్రిష్ణగిరి: అనారోగ్యంతో బాధపడుతూ విరక్తిచెందిన యువకుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. సూళగిరి సమీపంలోని పెద్దచప్పడి గ్రామానికి చెందిన మురుగేష్‌ కొడుకు రామమూర్తి (19). కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఫలితంలేక పోవడంతో జీవితంపై విరక్తి చెందిన రామూర్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్‌ 

మరిన్ని వార్తలు