తూర్పు గోదావరి: మహిళా వలంటీర్‌ ఆత్మహత్య 

8 Dec, 2021 13:01 IST|Sakshi
పిల్లా సుశీల (ఫైల్ ఫోటో)

తూర్పు గోదావరి: సంధిపూడికి చెందిన వలంటీర్‌ పిల్లా సుశీల(28) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆలమూరు ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ కథనం ప్రకారం... స్థానిక ఎస్సీపేటలో నివాసముంటున్న సుశీల, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కొద్దిసేపటికి తరువాత చిన్నారులిద్దరూ ఇంట్లోకి వచ్చి చూసి ఆ విషయాన్ని బయటకు చెప్పడంతో స్థానికులు వచ్చే సరికే సుశీల మృతి చెంది ఉంది. 

దీనిపై మృతురాలు తండ్రి రాజానగరం మండలం కొండగుంటరుకు చెందిన మెల్లెం తుక్కయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు  నమోదు చేయగా మండపేట రూరల్‌ సీఐ పి.శివగణేష్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి కేసును త్వరితగతిన చేధిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలు సుశీలకు భర్త వీర్రాజుతో పాటు ఇద్దరు కువ కేసును త్వరితగతిన చేధిస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలు సుశీలకు భర్త వీర్రాజుతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు