సుశాంత్‌ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్‌ 

31 Jul, 2020 16:46 IST|Sakshi

మనీ లాండరింగ్‌ ఆరోపణలతో ఈడీ కేసు నమోదు

సాక్షి,ముంబై:  బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  కేసు నమోదు చేసింది. నిన్న (గురువారం) సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్‌ ఆరోపణలతో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బిహార్ పోలీసుల నివేదిక ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.  

ఈ కేసుకు సంబంధించి బిహార్ పోలీసు బృందం జరిపిన దర్యాప్తుపై పట్నాలోని బిహార్ డీజీపీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ ఖాతానుంచి  సుమారు 15 కోట్ల రూపాయలను నటి రియా చక్రవర్తి వాడుకుందని సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.  (సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతాలు పరిశీలిస్తు‍న్న ఈడీ)

భారీ మొత్తంలో సుశాంత్ డ‌బ్బును అక్ర‌మ రీతిలో వాడుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌ విచారించాలని మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ ఇప్పటికే కోరారు.  ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసీఐఆర్) ను నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు