Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాల

22 Sep, 2021 12:41 IST|Sakshi

హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లోని ఆఫీసుల్లోనూ...  

కీలక పత్రాలు స్వాధీనం.. ఆస్తుల తాత్కాలిక జప్తునకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్‌ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌పై సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్‌ సి.పార్థసారథిని జైల్లో విచారించింది.

తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్‌ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. 

రూ.3 వేల కోట్ల స్కాం 
కార్వీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ రంజన్‌ సింగ్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్‌ హెడ్‌గా ఉన్న వైస్‌ ప్రెసిడెంట్‌ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్‌ రిమాండ్‌లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్‌కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్‌ లో మరో కేసు నమోదైంది.

కార్వీ ద్వారా డీమ్యాట్‌ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్‌ ఆఫ్‌ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్‌కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్‌ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది.   
 

చదవండి: పంజాబ్‌కు ‘కార్వీ’ పార్థసారథి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు