ఖాతాలు ఎవరివి.. కాసులు ఎక్కడివి? రెండో రోజు చీకోటిపై ప్రశ్నల వర్షం

3 Aug, 2022 02:07 IST|Sakshi

మాధవరెడ్డిని కూడా విచారించిన ఈడీ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: క్యాసినోవాలా చీకోటి ప్రవీణ్‌ వ్యవహారంలో ఈడీ విచారణ రెండో రోజూ కొనసా గింది. మంగళవారం ప్రవీణ్‌తోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి కూడా విచారణకు హాజరయ్యా రు. తొలిరోజు విచారణలో భాగంగా ప్రవీణ్‌ లావా దేవీల్లో కొన్ని విదేశీ ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. హవాలా మార్గంలో ఆ విదేశీ ఖాతాలకు డబ్బు వెళ్లినట్టు గుర్తించిన అధికా రులు.. ఆ కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం.

ఆ విదేశీ ఖాతాలు ఎవరివి?
ప్రవీణ్‌ ల్యాప్‌ట్యాప్, మొబైల్‌లోని ఈ–మెయిల్స్, వాట్సాప్‌ చాటింగ్‌లలో కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో విదేశీ ఖాతాల నంబర్లు, వాటికి పంపించిన సొమ్ము లావాదేవీల వివరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ 18 ఖాతా లెవరివి, హవాలా ద్వారా అంత పెద్ద మొత్తంలో సొమ్మును ఎందుకు తరలించారన్న వివరాలపై ప్రవీణ్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది.

ఇక నేపాల్, ఇండోనేషియాల్లో క్యాసినో ఆడేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బు తరలించడాన్ని ప్రస్తావిస్తూ.. హవాలా కోసం హైదరాబాద్‌లో ఇచ్చిన డబ్బులు ఎక్కడివని ప్రవీణ్‌ను, మాధవరెడ్డిని ఆరా తీసినట్టు సమాచారం. ఒక్క జూన్‌లోనే రూ.40 కోట్లకుపైగా నేపాల్‌కు చేరినట్టు ఈడీ గుర్తించింది. ఆ డబ్బు ఎవరెవరి నుంచి ఎంత మేర తీసుకున్నారు? ఏ హవాలా ఏజెంట్‌ ద్వారా నేపాల్‌కు చేరవేశారు? అక్కడ ఎవరి ద్వారా తీసు కున్నారన్న వివరాలపై ప్రశ్నించినట్టు తెలిసింది.

అయితే క్యాసినో ఆడిన వా రిలో చాలామంది వీఐపీలు ఉండటంతో వారి పేర్లు చెప్పేందుకు ప్రవీణ్, మాధవరెడ్డి భయపడుతున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు సినీ సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ప్రవీణ్‌ వాట్సాప్‌ డేటాను బ్యాకప్‌ చేసి, క్యాసినోల కోసం డబ్బులు ఇచ్చినవారి వివరాలు తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

మీడియాపై రుసరుస..
రెండో రోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్‌ మీడియాపై రుసురుసలాడారు. ఒక్కో మీడియా సంస్థ ఒక్కో రకంగా తనపై ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.  కాగా, చీకోటి ప్రవీణ్‌ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, చినజీయర్‌ స్వామిలను కూడా విచారించాలని ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్‌ మంగళవారం ఈడీకి ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు