హైదరాబాద్‌లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు

27 Jul, 2022 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలతో ఒక్కసారిగా కలకలం రేగింది.  ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు జరిగాయి. ఈ దాడులు క్యాసినో నిర్వహించే లోకల్‌ ఏజెంట్లపైనే జరిగినట్లు తెలుస్తోంది. 

లోకల్ ఏజెంట్లు మాధవ రెడ్డి, చికోటి ప్రవీణ్ ఇంటి ఫై  ఈడీ దాడులు. ఇండో - నేపాల్ సరిహద్దుల్లో క్యాసినో నిర్వహణ పై ఈ ఇద్దరు ఏజెంట్ల ఇళ్లలో ఈడీ సోదాలు  చేస్తున్నట్లు తెలుస్తోంది. పేకాట రాయుళ్ల కోసం స్పెషల్ ఫ్లైట్లలో టిక్కెట్లు ఏర్పాట్లు చేశారు ఈ ఇద్దరు లోకల్ ఏజెంట్లు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు కస్టమర్లను తరలించి.. అక్కడినుండి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈవెంట్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు. 

జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఇండో నేపాల్ బార్డర్ లో ఈవెంట్ నిర్వహించారు. అలాగే.. ప్రైజ్ మనీని హవాలా రూపంలో చెల్లించారు. ఒక్కో కస్టమర్ నుండి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు ఈ ఇద్దరు లోకల్ ఏజెంట్లు. నాలుగు రోజుల ప్యాకేజీ లో భాగంగా ప్లాన్ టారిఫ్‌లు సైతం అందించారు. నేపాల్ తో పాటు ఇండోనేషియా లోనూ క్యాసినో ఈవెంట్ లు నిర్వహించినట్లు తేలింది. దీంతో.. ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఇదిలా ఉంటే గతంలోనూ చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు