అరెకరం భూమి కోసం అన్న ప్రాణం తీసిన తమ్ముడు

8 Apr, 2021 01:13 IST|Sakshi

సాక్షి, దామరగిద్ద (నారాయణ పేట): తనకు రావాల్సిన అరెకరం భూమి రికార్డు చేసివ్వడం లేదని, రైతుబంధు డబ్బులు తనే తీసుకుంటున్నాడనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అన్నను కడతేర్చాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని క్యాతన్‌పల్లిలో బ్యాగరి హన్మంతు (52), బుగ్గప్ప, భీమప్ప అన్నదమ్ములకు ఆరెకరాల భూమి ఉంది.  రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అన్న హన్మంతుకు మూడెకరాలుండగా మిగిలిన ఇద్దరికీ ఎకరాన్నర చొప్పున నమోదై ఉంది.

అన్న పేరుతో ఉన్న అదనపు భూమిలో మిగిలిన ఇద్దరికి చెరో అరెకరం భూమిని రికార్డు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు హన్మంతు శివారులోని వరి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అదేరాత్రి 11 గంటలకు అక్కడికి తమ్ముడు బుగ్గప్ప వెళ్లి అన్నతో గొడవకు దిగగా పక్కపొలంలో ఉన్న రైతు బ్యాగరి బాలన్న వారిని విడిపించేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే బు గ్గప్ప కత్తితో చేసిన దాడి లో అన్న హన్మంతు చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు