పెందుర్తిలో వృద్ధురాలు దారుణ హత్య

31 Jul, 2023 09:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఓ వృద్దురాలు దారుణ హత్యకు గురైంది. పెందుర్తిలోని సుజాతనగర్‌కు చెందిన వరలక్ష్మి దంపతులు(70) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. ఇటీవల వారి వద్ద ఉల్లిపాయలు కట్ చేసే వర్కర్‌గా వెంకటేష్‌ ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వరలక్ష్మి ఇంట్లో డబ్బు ఉందని భావించిన వెంకటేష్‌.. నిన్న రాత్రి ఆమె ముఖంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. 

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు వృద్ధురాలు నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ లోపలికి వచ్చి బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితమే వెంకటేష్‌ పనిలో చేరినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు