కొడుకుతో సహా వృద్ధురాలి ఆత్మహత్య

21 Feb, 2024 09:36 IST|Sakshi

హైదరాబాద్: అరవై ఏడేళ్ల వయసున్న వృద్ధురాలు...42 ఏళ్ల వయసున్న ఆమె కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజిగిరి పటేల్‌ నగర్‌లో మంగళవారం ఈ సంఘటన వెలుగులోకి వచి్చంది. ఈ వయసులో వారికి ఏం కష్టం వచి్చందోనని స్థానికులు చర్చించుకోవడం కని్పంచింది. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌.ఐ కృష్ణమల్‌ తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్‌కు చెందిన స్వరూప (67)కు కుమారుడు శ్రీకాంత్‌(42) ఉన్నాడు. ఇతడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

ఇతని సోదరుడు రవి నిజామాబాద్‌లో ఉంటున్నాడు. 15 ఏళ్ల క్రితం భర్తతో విభేదాలు రావడంతో స్వరూప విడిపోయి మల్కాజిగిరి పటేల్‌నగర్‌లో నివాసముంటున్నది. అలాగే శ్రీకాంత్‌కు వివాహం అయినప్పటికీ భార్యతో విభేదాలు రావడంతో విడిపోయి తల్లితో కలిసి ఉంటున్నాడు. కాగా గత రెండు రోజులుగా స్వరూప, శ్రీకాంత్‌లు కనిపించకపోవడంతో మంగళవారం ఇంటి యజమాని వారు ఉంటున్న పోర్షన్‌కు వెళ్లి కిటికీలోంచి చూడగా స్వరూప ఉరి వేసుకుని ఉండటం గమనించాడు. 

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోనికి వెళ్లి చూడగా మరొక రూములో శ్రీకాంత్‌ కూడా ఉరి వేసుకుని ఉండడం గమనించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌ నుంచి వచి్చన రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కృష్ణమల్‌ తెలిపారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు