ఇంటి స్లాబ్‌ వేస్తుండగా విద్యుదాఘాతం

14 Jun, 2021 21:10 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేస్త్రీ సురేష్‌, తీవ్ర గాయాలతో యజమాని చంద్రారెడ్డి

యజమాని, మేస్త్రీకి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం...

హైదరాబాద్‌కు తరలింపు 

ధారూరు మండలం కేరెళ్లిలో ఘటన

ధారూరు/వికారాబాద్‌: ఇంటికి స్లాబ్‌ వేయిస్తున్న క్రమంలో ఇంటి యజమాని, మేస్త్రీకి విద్యుదాఘాతం కావడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ధారూరు మండల పరిధిలోని కేరెళ్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ధారూరు మండంల కేరెళ్లి గ్రామనికి చెందిన చంద్రారెడ్డి(55) గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఆదివారం స్లాబ్‌ వేయించారు. కూలీలంతా కిందకు దిగినప్పటికీ పైన సెంట్రింగ్‌ మేస్త్రీ సురేష్‌ మాత్రం చంద్రారెడ్డి సూచన మేరకు పైనే ఉన్నాడు.

ఇంటిపైకీ ఎవరు ఎక్కకుండా కింద ఉన్న ఇనుపరాడ్‌ను మెట్లపై అడ్డంగా పెట్టేందుకు పైకీ తీసుకెళ్లాడు చంద్రారెడ్డి. ఇనుపరాడ్‌ను అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలకు ఇనుపరాడ్‌ తగిలింది. యజమానిని రక్షించబోయిన మేస్త్రీ సురేష్‌ కూడా షాక్‌కు గురియ్యాడు. విద్యుత్‌ షాక్‌తో ఇద్దరూ భవనం పైనుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు.. 
కొత్త ఇంటి నిర్మాణానికి స్లాబ్‌ వేస్తున్నామని, విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలనీ చంద్రారెడ్డి విద్యుత్‌ అధికారులకు మొరపెట్టుకున్నారు. వారెవరు వినలేరని, గత్యంతరం లేక జాగ్రత్తగా స్లాబ్‌ వేయించిన ఇనుపరాడ్‌ మెట్లకు అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తూ షాక్‌కు గురిౖయె ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వాపోయారు. అధికారుల నిర్లక్షమే చంద్రారెడ్డి, మేస్త్రీ ప్రమాదానికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌

మరో ఘటనలో బాలుడికి గాయాలు..
దోమ: విద్యుదాఘాతంతో బాలుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని గుండాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కోళ్ల రవి, చెన్నమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్‌ చెయ్యి విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘతానికి గురై కొట్టుకుంటుండంగా మరో బాలుడు పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడికి కూడా విద్యుత్‌షాక్‌ తగలడంతో పక్కకు జరిగి కేకలు వేశాడు.

అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన జనుమాండ్ల వెంకట్‌రెడ్డి గమనించి వెంటనే కర్రతో కొట్టగా శ్రీకాంత్‌ కిందపడిపోయాడు. వెంటనే కొస్గీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా రెండు నెలల క్రితం గ్రామస్తులకు ఆసరా పెన్షన్లు, రేషన్‌ బియ్యం అందించేందుకు పాఠశాల ఆవరణలో విద్యుత్‌ సరఫరా తీసుకుని అలాగే వదిలివేశారు. అతుకులతో కూడిన విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించాలని గ్రామస్తులు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకలేదని గ్రామస్తులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు