ఉద్యోగి ఘనకార్యం.. రిచ్‌గా పెళ్లి చేసుకునేందుకు ఏం చేశాడంటే..?

15 Mar, 2022 08:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(కర్ణాటక): వైభవంగా పెళ్లి చేసుకోవడానికి తను పనిచేసే బ్యాంకునే దోచుకున్నాడో ఘనుడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురుగోడు డీసీసీ బ్యాంక్‌లో మార్చి 6న రూ.ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు. అయితే  కేసు విచారించిన పోలీసులు బ్యాంక్‌లో పనిచేస్తున్న క్లర్క్‌ బసవరాజు సిద్ధంగప్ప హుణిసికట్టి (30), అతడి అనుచరులు సంతోష్‌ కాళప్ప కుంబార (31), గిరీశ్‌ (26) దొంగతనం చేశారని తేల్చారు.

చదవండి: కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?

దీంతో వీరిని అరెస్టు చేసి.. నాలుగుకోట్ల 20 లక్షల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాదీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి క్లర్క్‌ బసవరాజు, అతని స్నేహితులతో కలిసి బ్యాంకు దోపిడీ చేసినట్లు తేలింది. దోచుకున్న సొత్తును జిల్లాలోని రామదుర్గ తాలూకా తోరణగట్టి గ్రామంలోని వ్యవసాయతోటలో పాతి పెట్టారు. తన పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు కోసం ఈ చోరీకి పాల్పడినట్లు క్లర్క్‌ విచారణలో తెలిపాడు.  

మరిన్ని వార్తలు