బైక్‌తో బీటెక్‌ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని

22 Jun, 2021 15:04 IST|Sakshi

హైదరాబాద్: మియాపూర్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌తో బీభత్సం సృష్టించాడు. అతి వేగంతో 8 నెలల గర్భిణి అయిన భానోత్ అచ్చిబాయిని బైక్‌తో డీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అచ్చిబాయికి ప్రమాదం తప్పినా.. గర్భం శోకం తప్పలేదు. ఆమెకు అబార్షణ​ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మియాపూర్‌ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు పోలీసులు గుర్తించారు.

చదవండి:అమెరికాలో మియాపూర్‌ వాసి మృతి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు