క్రికెట్‌ బెట్టింగ్‌కు ఇంజనీరింగ్‌ విద్యార్థి బలి

27 Feb, 2021 19:24 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యసనం‌‌ ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన కుప్పంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుప్పానికి చెందిన కిరణ్‌ అనే విద్యార్థి కేఈసీ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కిరణ్‌కు క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనంగా మారింది. దీంతో లక్షల రూపాయలు బెట్టింగ్‌ కాసి పోగొట్టుకుని, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎవ్వరూ బెట్టింగులు పెట్టి మోసపోవద్దు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు.

చదవండి : కిలేడీ.. మేకప్‌ వేసుకుంటే కనుక్కోలేం!..

దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు