ఈఎస్‌ఐ కుంభకోణం: దూకుడు పెంచిన ఈడీ..

23 Nov, 2021 18:20 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనంగా మారిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి.. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ ఆస్తులతోపాటు ఫార్మసిస్టు కె. నాగమణి, కాంట్రాక్టర్లు కె. శ్రీహరిబాబు, పి. రాజేశ్వర్‌ రెడ్డి ఆస్తులను అటాచ్‌ చేసింది.

బీమా, వైద్య సేవలకు సంబంధించి రూ. 144 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తెలింది. రాష్ట్ర ఏసీబీ అధికారుల కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు