మాజీ భార్యను చూసేందుకు వచ్చి...

15 Jul, 2021 06:38 IST|Sakshi

కెలమంగలం(కర్ణాటక): మాజీ భార్యను చూసేందుకు వెళ్లిన భర్తపై ఆమె తరఫు బంధువులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటన కెలమంగలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. బెంగళూరు మంగళమ్మపాళ్యంకు చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్‌(32)కు  కెలమంగలం సమీపంలోని దొడ్డబేళూరుకు చెందిన రుక్కు అనే మహిళతో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆరు నెలలకే విడిపోయారు.

అయితే భార్యను చూసేందుకు ఇమ్రాన్‌ మంగళవారం వెళ్లగా ఆమె తరఫు బంధువులు అతన్ని కారులో కెలమంగలంవైపు తీసుకెళ్లి చిన్నట్టి వద్ద దాడి చేసి ఉడాయించారు. అతన్ని స్థానికులు క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  నిందితులుగా భావిస్తున్న కెలమంగలం గణేష్‌కాలనీకి చెందిన సిద్దిక్, మాలిక్, రహమ్మాన్, దొడ్డబేళూరుకు చెందిన సాధిక్, జమీర్‌ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.  

మరిన్ని వార్తలు