హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కేసు కలకలం

24 Mar, 2021 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్ కేసు హైదరాబాద్‌లో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. ఎక్సైజ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రముఖులకు డ్రగ్స్‌ పంపించిన డీలర్ డాడీ బాయ్‌కి సంబంధించిన డెలివరీ బాయ్‌ జేమ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. నాలుగేళ్ల కిత్రం వరకు హైదరాబాద్‌లో డాడీ బాయ్‌ డ్రగ్స్‌ బిజినెస్‌ నిర్వహించాడు. ప్రస్తుతం గోవా, బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్‌ దందా నడుపుతున్నాడు. గతంలో డ్రగ్స్‌ డీలర్ డాడీ బాయ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లో ప్రముఖులకు డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ప్లాన్‌ చేశాడు. నగరం‌లో  గుడ్ స్టఫ్‌ అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్‌లు పంపించాడు.

ఫోన్ నంబర్లు ఇవ్వకుండా వాట్సాప్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రగ్స్ దందాను ఆపరేట్‌ చేశాడు. ఈనెల 14న బస్సు ద్వారా అతడు పంపిన డ్రగ్స్‌ హైదరాబాద్‌ చేరాయి. ఈ డ్రగ్స్‌ జేమ్స్ అనే నైజీరియన్ ద్వారా డెలివరీ అవుతున్నయి. పక్కా సమాచారంతో డెలివరీ బాయ్ జేమ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. బల్క్ ఆర్డర్ చేసిన ప్రముఖులపై ఎక్సైజ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ హోటల్స్, నెక్లస్రోడ్ , చెక్పోస్ట్, డ్రైవ్ ఇన్‌ లే డెలివరీ స్పాట్స్‌ను పోలీసులు గుర్తించారు. ఒకేసారి 153గ్రాముల కొకెయిన్, ఎండీఎంఏ దొరకడంతో డ్రగ్స్ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్‌గా ఉంది.
చదవండి: అన్న సమక్షంలోనే వదినపై లైంగిక దాడి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు