కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు

19 Aug, 2020 06:55 IST|Sakshi
కాలం చెల్లిన బీరు

ప్రశ్నించిన వినియోగదారులతో యాజమాన్యం వాగ్వాదం 

 బీర్లను సీజ్‌ చేసిన ఎక్సైజ్‌ సీఐ వేణుకుమార్‌ 

మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్‌లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్‌ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్‌పీ ధర కంటే రూ.10తో అధిక ధరలకు బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. సదరు బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో బీరును మరో రూ.20 కలిపి అధిక ధరకు మద్యం ప్రియులకు అంటకడుతున్నారు. కాగా మండంలలోని పెద్దమాడ్గుల, నర్సాయిపల్లి, మాడ్గులకు చెందిన వారు మంగళవారం స్థానికంగా ఉన్న బెల్టు షాపుల వద్ద బీర్లు కొనుగోలు చేశారు.

వారు కొనుగోలు చేసిన బీర్లు కాలం చెల్లిపోవడంతో వినియోగదారులు బెల్టుషాపు నిర్వాహకులను ప్రశ్నించగా వైన్స్‌లో ఇచ్చిందే తెచ్చామని సమాధానం ఇచ్చారు. కొనుగోలుదారులు సరాసరి మాడ్గులలోని ఓ వైన్స్‌కు వచ్చి బీర్లు కొనుగోలు చేశారు. ఆ బీర్లు గతేడాది డిసెంబర్‌ 28వ తేదీ నుంచి ఈ ఏడాది జూన్‌ 24వరకు వినియోగించాల్సి ఉంది. ఈ విషయమై సదరు కొనుగోలుదారులు వైన్స్‌షాపు యజమానిని నిలదీయగా వేరేది ఇస్తాం.. అంటూ కొనుగోలుదారులతో వాగ్వాదానికి దిగారు. బీర్ల కాలపరిమితి దాటి సుమారు 2 నెలలు కావస్తున్నా వైన్స్‌షాపు యజమాన్యం ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొనుగోలుదారులు ఫోన్‌లో ఎౖMð్సజ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

కాలంచెల్లిన మద్యం సీజ్‌ చేశాం...... 
వినియోగదారుల నుంచి అందిన సమాచారం మేరకు మంగళవారం వైన్స్‌ను తనిఖీ చేశాం. కాలం చెల్లిన బీర్లను సీజ్‌ చేశాం. విషయం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. కాలం చెల్లిన బీర్లను ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత సదరు వైన్స్‌షాపు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సైజ్‌ శాఖ సీఐ వేణుకుమార్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా