మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కుమార్తెపైనా కన్నేయడంతో...!

16 Dec, 2022 10:02 IST|Sakshi

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: ఓ మహిళకు ఒకతనితో వివాహేతర సంబంధం ఉంది. అతను ఆమె కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురిచేయసాగాడు. ఈ విషయంపై మహిళ అతడిని పలుమార్లు హెచ్చరించింది. అయినా తీరు మారకపోవడంతో భరించలేకపోయిన తల్లి కర్ర, రాళ్లతో అతడిపై దాడి చేయగా తీవ్రగాయమై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై వెంకటాచలం పోలీసులు ఈ ఏడాది జూన్‌ 8వ తేదీన హత్య కేసును నమోదు చేశారు. ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు.

 వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కసుమూరు కొండపై నివాసం ఉంటున్న కూరపాటి వెంకయ్య (74)కు, అక్కడే నివాసముంటున్న మోతే నారాయణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే నారాయణమ్మ కుమార్తెను కూడా వెంకయ్య లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణమ్మ పలు సందర్భాల్లో వెంకయ్యను మందలించింది. 

జూన్‌ 8న తెల్లవారుజామున నారాయణమ్మ కుమార్తె బహిర్భూమికి వెళ్లగా, వెంకయ్య వెంబడించి పట్టుకోవడంతో పెద్దగా కేకలు వేసింది. నారాయణమ్మ అక్కడికి చేరుకుని కర్రతో వెంకయ్యపై దాడి చేసింది. అక్కడి నుంచి కుమార్తెను తీసుకుని వెళ్లిపోతుండగా, వెంకయ్య మళ్లీ వెంబడించడంతో అక్కడే ఉన్న రాళ్లతో కొట్టి వెళ్లిపోయింది. అయితే వెంకయ్య మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. నారాయణమ్మను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ గంగాధర్‌రావు, ఎస్సై అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు