వివాహేతర సంబంధం: బీరు బాటిల్‌తో తలపై కొట్టి..

6 Mar, 2021 12:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పటాన్‌చెరు టౌన్‌: వివాహేతర సంబంధంతో  ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు  శుకవ్రాం డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన మంగళి రమేశ్‌ (41) హెయిర్‌ కటింగ్‌ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రమేశ్‌కు షాపు ఎదుట ధర్మకాంటలో పనిచేసే మహేందర్‌కు పరిచయం ఏర్పడి ఇద్దరు స్నేహితులైయ్యారు.

ఈ క్రమంలో మహేందర్‌ భార్య శోభతో రమేశ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడటంతో మహేందర్‌ రమేశ్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకంలో భాగంగా ఫిబ్రవరి 25వ తేదీన మహేందర్‌ తన గ్రామానికి చెందిన స్నేహితులు సుభాష్, నునవత్‌ ప్రకాశ్‌లతో కలసి మద్యం సేవించడానికి వెళ్దామని చెప్పి రమేశ్‌ను కారులో జహీరాబాద్‌ మండలంలోని హోతి(బి) గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు.  

పథకం ప్రకారమే హత్య.. 
ముందుగా వేసుకున్న పథకం మేరకు బీరు బాటి ల్‌తో రమేశ్‌ తలపై కొట్టి, పగిలిన బాటిల్‌తో తలపై పొడిచి హత్య చేశారు. కాగా రమేశ్‌ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మరుసటి రోజు అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా, మార్చి 4న జహీరాబాద్‌ పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి, మృతుడు అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన రమేశ్‌గా ధ్రువీకరించారు.

ఫోన్‌ నంబర్ల ఆధారంగా గుర్తింపు 
పటాన్‌చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, సీఐ వేణు గోపాల్‌ రెడ్డి, అమీన్‌పూర్‌ ఎస్‌ఐ మురళీ దర్యాప్తు లో భాగంగా ఫోన్‌ నంబర్ల ఆధారంగా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లో గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా కేతవత్‌ మహేందర్, సుభాష్, ప్రకాశ్‌  కలసి హత్య చేసినట్లు ఒప్పు కున్నారు. హత్య చేసి తిరిగి వచ్చే సమయంలో కొత్త బట్టలు సంగారెడ్డిలో కొనుగోలు చేసుకొని వైకుంటపురం ఆలయంలో స్నానాలు చేసి రక్తం మరకలతో ఉన్న బట్టలను ఆలయం వెనుక భాగంలో పడేసి నట్టు దర్యాప్తులో తెలిపారు. ఈ మేరకు వారి వద్ద నుంచి మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన క్రైం సీఐ శ్రీనివాసులు, సీఐ వేణు గోపాల్‌ రెడ్డి, అమీన్‌పూర్‌ ఎస్‌ఐ మురళిని డీఎస్పీ అభినందించారు. 

మరిన్ని వార్తలు