ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు 

23 Mar, 2021 08:04 IST|Sakshi

20 లక్షల జరిమానా

వివాహేతర సంబంధం యువకుడి ఆత్మహత్య 

తరిగొప్పుల: పల్లెల్లో పెద్ద మనుషులు ఇచ్చే తీర్పులు మనుషుల ప్రా ణాలు బలికొంటున్నా యి. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం  వాల్యా తండాకు చెందిన బానోతు రాజు (22), అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం ఇద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి కోసం సదరు వివాహిత భర్త, బంధువులు వెతకగా.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో దొరికారు.  అనంతరం గ్రామంలో పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా రూ.20 లక్షలు సదరు వివాహిత భర్తకు రాజు చెల్లించేలా తీర్మానించారు. దీంతో మనస్తాపం చెందిన రాజు.. అదేరోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

మరిన్ని వార్తలు