ఫేస్‌బుక్‌లో యువకుడితో పరిచయం.. ఇంట్లో పిల్లలు నిద్రపోతుంటే

18 Sep, 2022 15:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో తన తల్లి పరారైనట్లు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని కవరపట్టు గ్రామానికి చెందిన అయ్యప్పన్, లలిత (41) దంపతులకు 21, 19 ఏళ్ల ఇద్దరు  కుమారులు ఉన్నారు. అయ్యప్పన్‌ సింగపూర్‌లో పని చేస్తున్నాడు. దీంతో  కుమారులతో లలిత ఒరత్తనాడులో అద్దె ఇంట్లో ఉంటోంది.

గురువారం రాత్రి పిల్లలు నిద్రిస్తుండగా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని లలిత హఠాత్తుగా అదృశ్యమైంది. పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో.. తన తల్లికి ఫేస్‌బుక్‌ ద్వారా రెండేళ్ల క్రితం ఓ యువకుడి (22)తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నాడు. నగలు, నగదుతో ఆ యువకుడితో పరారైనట్లు తెలిపాడు. ఒరత్తనాడు పోలీసులు కేసు నమోదు చేసి లలిత, ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.

చదవండి: కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా..

మరిన్ని వార్తలు