ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..

9 Sep, 2022 13:25 IST|Sakshi
సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాండ్యరాజన్‌ 

సాక్షి, చెన్నై: చెన్నై విల్లివాక్కంలో యువతి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని అలందూర్‌ పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్‌ (50) చెన్నై కార్పొరేషన్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో బాంబు పేలుడు విభాగంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి విల్లివాక్కంకు చెందిన ఒక మహిళతో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. ఆ మహిళకు ఒక కుమార్తె ఉంది.

ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంటిలో ఉన్న ప్రియురాలు కుమార్తె (13)పై సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కన్నుపడింది. దీంతో పాండ్యరాజన్‌ తన ప్రియురాలి ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి లైంగిక వేధింపులు ఇస్తున్నాడు. సుమారు  ఏడేళ్లుగా బాలికకు ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు అయింది. ఆమెకు మరొకరితో వివాహమైంది. కానీ తన తల్లి ఇంటికి వస్తున్న సమయంలో యువతికి తిరిగి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాండ్యరాజన్‌ లైంగిక వేధింపులు ఇస్తున్నాడు.

అతని వేధింపులను సహించలేక ప్రియురాలు, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికను 13 ఏళ్ల నుంచి బెదిరింపులు లైంగికంగా వేధించినట్లు, ప్రస్తుతం వేరొకరితో వివాహం అయినప్పటికీ లైంగిక వేధింపులకు పాల్పతుండడంతో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. 
చదవండి: ఎస్కార్ట్‌ సర్వీస్‌ పేరుతో నీచాలు.. అశ్లీల వ్యాఖ్యలతో ఫోటోలు ఆప్‌లోడ్‌ చేస్తూ..

మరిన్ని వార్తలు