Fact Check: ఉచితంగా టాటా సఫారీని గెలుచుకోండి!

7 Jun, 2021 15:51 IST|Sakshi

ఉచితంగా టాటా స‌ఫారీ

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ 

మోస‌పోయి లింక్స్ క్లిక్ చేస్తున్న నెటిజ‌న్లు

మీకు 'కంగ్రాచ్యులేషన్' మేం అడిగిన నాలుగు ప్ర‌శ్న‌ల‌కు చ‌క్క‌గా స‌మాధానం చెప్పారు. త్వ‌ర‌లో మీకు టాటామోటార్స్ త‌రుపు నుంచి ఉచితంగా టాటా స‌ఫారీ వాహనాన్ని అందిస్తాం’ అంటూ ఓ మెసేజ్ సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. అయితే వైర‌ల్ అవుతున్న ఈ మెసేజ్ ఫ్యాక్ట్ చెక్ చేస్తే సైబ‌ర్ మోస‌గాళ్లు ఈ న‌యామోసానికి తెర‌లేపిన‌ట్లు తేలింది. 

ఇప్ప‌టి వ‌ర‌కు టాటామోటార్స్ కు చెందిన 30మిలియ‌న్ల వాహ‌నాలు సేల్ అయ్యాయి. ఇందులో భాగంగా టాటామోటార్స్ ఓ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించిన‌ట్లు ఓ మెసేజ్ చ‌క్కెర్లు కొడుతుంది. ఆ మెసేజ్ లో ఓ అన‌ధికారిక సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్ పైన టాటామోటార్స్ పేరుంటుంది. త‌ప్పా ఊరు, అడ్ర‌స్ ఉండ‌దు. ఇక సైట్ లో నాలుగు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాల్సి ఉంది. ఆ స‌మాధానం చెబితే టాటా స‌ఫారీని సొంతం చేసుకోవ‌చ్చు అంటూ ఊరించ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు 4 వేల మందికి పైగా ఆ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.  మ‌రికొంత‌మందికి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. 

దీని గురించి ఆరా తీస్తే సైబ‌ర్ నేర‌స్తులు ఐపీ అడ్ర‌స్‌, వ్య‌క్తిగ‌త స‌మాచారం దొంగిలించేందుకు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ అధికారిక వెబ్ సైట్ లో ఎలాంటి ఆఫ‌ర్లు లేవు. కాబ‌ట్టి ఇది పక్కా ఫ్రాడ్ అని టెక్ నిపుణులు తేల్చారు. పొర‌పాటున‌ ఆ మెసేజ్ మీకు వ‌స్తే లింక్ ఓపెన్ చేసి స‌మాధానాలు చెప్పే ప్ర‌య‌త్నం చేయోద్ద‌ని, అలా చేస్తే వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాగా, వైర‌ల్ అవుతున్న లింక్స్ పై ప‌లువురు నెటిజ‌న్లు ఆ అవును మా ఇంటికి టాటా స‌ఫారీ వాహ‌నం వ‌చ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: Mahindra : మహీంద్ర బంపర్‌ ఆఫర్‌
  

మరిన్ని వార్తలు