బీటెక్‌ చదివి బాబా అయ్యాడు.. సొంత ఆశ్రమం.. హోమాలు.. అబ్బో కథ పెద్దది!

1 Aug, 2021 10:09 IST|Sakshi
విజువల్స్‌లో తెల్లగడ్డం ఉన్న వ్యక్తి బాబా విశ్వచైతన్య

సాక్షి, నల్లగొండ క్రైం: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఇతర సమస్యలతో బాధపడుతున్నారా..? అమావాస్య, పున్నమికి రండి.. ప్రత్యేక పూజలు చేసి మీ చింత తీరుస్తా.. అని నమ్మబలుకుతూ అమాయకుల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న బురిడీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..  కృష్ణా జిల్లాకు చెందిన సాయి విశ్వ చైతన్య హైదరాబాదులో పుట్టి పెరిగాడు. అక్కడే బీటెక్‌ వరకు చదివాడు. అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. పీఏపల్లి మండలంలోని అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, తాయత్తులు కడుతూ, హోమాలు చేస్తూ రూ. కోట్లు దండుకున్నాడు. 

మహిళ ఫిర్యాదుతో..
ఇటీవల తనకు బాగుచేస్తానని సాయి విశ్వ చైతన్య నమ్మించి డబ్బులు తీసుకుని మోసగించాడని ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ రంగనాథ్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని నియమించారు. ఆశ్రమంలో ఉన్న సాయి విశ్వ చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద  నగదు, బంగారు ఆభరణాలు, విలువైన డిపాజిట్‌ బాండ్లు, ల్యాప్టాప్‌లు, ప్రవచన బ క్కులను ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత ఆరు నెలలుగా బురిడీ బాబా.. సాయిబాబా భక్తునిగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు