బాలికపై అత్యాచారం.. బాబాకు బడితపూజ

13 Oct, 2020 13:07 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తు అత్యాచార యత్నానికి పాల్పడుతున్న ఓ వ్యక్తికి బాధితులు, మహిళలు దేహశుద్ధి చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పతున్న దొంగ బాబాకు బడితపూజ చేశారు. అభంశుభం తెలియని బాలికను బెదిరించి లైంగిక వాంఛను తీర్చుకుంటున్న ఘటన నిజామాబాద్‌ నగరంలో మంగళవారం వెలుగుచూసింది. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతూ.. మత్తుమం‍దు ఇచ్చి మూడు నెలలుగా బాలికపై ఆకృత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. (గర్భం దాల్చిన మైనర్ బాలిక)

దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు దొంగబాబాను చితకబాదారు. అయితే భూతవైద్యం పేరుతో మరికొంతమంది మహిళలపై కూడా గతకొంతకాలంగా లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు