నకిలీ చలానాల వ్యవహారంలో బాధ్యుల సస్పెన్షన్

13 Aug, 2021 13:39 IST|Sakshi

సాక్షి, విజయవాడ/కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.  కర్నూలు జిల్లా, నంద్యాల సబ్ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు సస్పెండ్‌ చేశారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్‌మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు.

మరిన్ని వార్తలు