తప్పుడు కోవిడ్‌ రిపోర్టు.. వైద్య సిబ్బంది అరెస్టు..

19 Jul, 2021 11:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బనశంకరి(కర్ణాటక): కాసుల కోసం కక్కుర్తి పడి తప్పుడు రిపోర్టును సృష్టించిన ఇద్దరు వైద్యసిబ్బంది కటకటాల పాలయ్యారు. బాగల్‌కోటే జిల్లా ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్, సిటీ స్కాన్‌లోని మగ స్టాఫ్‌ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మే 2న ముదోళకు చెందిన శేఖవ్వ రూగి (53) శ్వాసకోస సమస్యతో జిల్లా ఆసుపత్రిలో మృతిచెందింది.

ఆమెకు కోవిడ్‌ పరీక్షలు చేయలేదు. ఆమె పేరుతో కరోనా మృతులకు ఇచ్చే పరిహారం కొట్టేయడానికి డేటా ఆపరేటర్‌ బసవగౌడ, స్టాఫ్‌నర్సు బసవరాజ్‌ కలిసి కరోనా పాజిటివ్‌ అని నకిలీ ఆర్‌టీ పీసీఆర్‌ నివేదికను తయారు చేశారు. ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు విచారణలో వీరి నేరం బయటపడడంతో అరెస్టు చేశారు.   
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు