మహిళా డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సందేహం రావడంతో..

16 Aug, 2022 16:10 IST|Sakshi

సాక్షి, చెన్నై: వివాహం చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్‌ వద్ద రూ.13 లక్షలు మోసం చేసిన నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై అడయార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళా డాక్టర్‌ ఒకరు వివాహం కోసం మాట్రిమోని వెబ్‌సైట్‌లో చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చెన్నై నావలూర్‌కు చెందిన కార్తీక్‌ రాజ అలియాస్‌ దినేష్‌ కార్తీక్‌ (28) ఆ వివరాలతో మహిళా డాక్టర్‌తో తాను కూడా డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

ఆమెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి రూ. 12.95 లక్షలు, ఒక ఫోన్‌ తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం మహిళా డాక్టర్‌ నేరుగా కలుసుకుని వివాహం గురించి మాట్లాడదామంటూ కోరగా కార్తిక్‌రాజ తిరస్కరించాడు. దీంతో అతనిపై సందేహం ఏర్పడిన మహిళా డాక్టర్‌ ఈ విషయం గురించి తన బంధువు ఒకరికి వివరించింది. అతను వెంటనే అడయారు పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్తీక్‌రాజ కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సోమవారం నిందితుడిని విచారణ చేశారు. ప్రేమ పేరుతో పలువురు యవతులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. బీకాం పూర్తి చేసి డాక్టర్‌గా ప్రచారం చేసుకుంటున్నట్లు నిర్ధారించారు. రూ. 98 వేలు నగదు, 5 సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌ సైకిల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. 
చదవండి: మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి.. 

మరిన్ని వార్తలు