ఫోన్‌ చూపించి, అత్యవసరంగా డబ్బులు కావాలని చెప్పి..

5 Aug, 2021 18:03 IST|Sakshi
విక్రయించిన ఫోన్‌గ్లాస్, షామిరొద్దీన్, ఆర్ఫత్‌

సాక్షి, పెద్దకొడప్‌గల్‌(నిజామాబాద్‌): సెల్‌ఫోన్‌ గ్లాస్‌ను కవర్‌లో ఉంచి సెల్‌ఫోన్లుగా చూపించి మోసగిస్తున్న ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా.. పిట్లం మండలంలోని సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన హలావత్‌ సంతోష్‌ అనే యువకుడి వద్దకు బుధవారం బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. వారు సంతోష్‌కు సామ్‌సంగ్‌ ఫోన్‌ చూపుతూ, అత్యవసరంగా డబ్బులు అవసరముందని చెప్పి రూ.24వేల విలువ గల ఫోన్‌ను రూ.2500కు విక్రయించారు.

నిందితులు డబ్బులు తీసుకొని ముందే పర్సులో పెట్టి ఉంచిన గ్లాస్‌లాంటి ఫోన్‌ను బాధితుడికి ఇచ్చి బైక్‌పై వెళ్లిపోయారు. అనంతరం సంతోష్‌ పర్సులోని ఫోన్‌ను చూడగా కేవలం ఫోన్‌ గ్లాస్‌ మాత్రమే ఉంది. దీంతో తను మోసపోయానని గ్రహించి, నిందితులను వెంబడించారు. పెద్దకొడప్‌గల్‌లో నిందితులను పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు పిట్లం మండల పరిధిలోకి వస్తుందని చెప్పి, నిందితులు షామిరోద్దీన్, ఆర్ఫత్‌లను పిట్లం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు