బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి

31 May, 2021 11:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, యాదాద్రి: రామన్నపేట మండలం మునిపంపులలో దారుణం జరిగింది. దంపతుల గొడవల్లో తలదూర్చిన బురిడీ బాబాలు.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పూజల పేరుతో మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడిని వీడియో తీసిన బురిడీ బాబాల అనుచరులు.. బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.లక్షలు వసూలు చేశారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకుండా పోలీసులు సెటిల్‌మెంట్‌ చేశారు.

దీంతో బాధిత మహిళ రాచకొండ సీపీని ఆశ్రయించింది. విచారణలో పోలీసులు, బాబాల బాగోతం వెలుగు చూసింది. నిర్లక్ష్యం వహించిన రామన్నపేట సీఐ, ఎస్‌ఐను సీపీ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చదవండి: ప్రేయసితో సెల్ఫీ వీడియో: చనిపోతున్నా.. చివరిసారి చూసిపో.. 

మరిన్ని వార్తలు