నకిలీ శాలరీ స్లిప్పులతో బ్యాంకుకు మోసం

17 Jul, 2021 19:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): నకిలీ శాలరీ స్లిప్పులు సృష్టించి హుబ్లీ ధార్వాడ కార్పొరేషన్‌ సిబ్బందితో బ్యాంక్‌ మేనేజర్‌ కుమ్మక్కై ధార్వాడ ఎస్‌బీఐ శాఖకు రూ. కోట్లలో వంచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్పొరేషన్‌ డివిజన్‌ నెంబర్‌ వన్‌లో కార్మికుల నకిలీ శాలరీ స్లిప్‌ సృష్టించి వంచనకు పాల్పడ్డారు. ఇద్దరు కార్పొరేషన్‌ సిబ్బంది ధార్వాడ ఎస్‌బీఐ గాంధీనగర శాఖ మేనేజర్‌ సంధ్యా సహకారంతో రుణాలు మంజూరు చేయించారు. బ్యాంక్‌ ఆడిట్‌ వేళ ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మేరకు ఈ కేసులకు సంబంధించి నలుగురిపై ధార్వాడ విద్యాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు దాఖలైన తక్షణమే బ్యాంక్‌ మేనేజర్‌ సంధ్యా ముందస్తూ బెయిల్‌ పొందారు. ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. కాగా విద్యాగిరి పోలీసులు రవికుమార దొడ్డమని, హనుమంత మదారను అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు నకిలీ శాలరీ స్లిప్‌ సృష్టించిన జిరాక్స్‌ దుకాణం సిబ్బందిని కూడా అరెస్ట్‌ చేశారు. 42 మందికి రుణాలు పొందగా ఒక్కొక్కరు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. కోట్ల రూపాయలు బ్యాంక్‌కు వంచన చేసినట్లుగా విద్యాగిరి పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు