ఖైరతాబాద్‌: తిమింగలం వాంతి పేరుతో మోసం..

16 Jun, 2021 14:40 IST|Sakshi

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్‌గ్రిస్‌(తిమింగళం వాంతి) పేరుతో మోసాలకు పాల్పడున్న ముఠాను ఖైరతాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంబర్‌గ్రిస్‌ పేరుతో నకిలీ పదార్థం అమ్మేందుకు యత్నించిన ఏడుగురు సభ్యుల గల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్‌ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ ఈ గ్యాంగ్ మోసాల‌కు తెగ‌బ‌డుతుంది. 

ఖైరతాబాద్‌లోని ఎస్‌బీఐ వీధిలో ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని వీరు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మొత్తం ఏడుగురు‌ నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి‌ తీసుకున్నారు. షకీర్‌ అలీ, షేక్‌ అలీ, మహమ్మద్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ నజీర్‌, మోహన్‌లాల్‌ యాదవ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్, మహమ్మద్‌ హుస్సానుద్దీన్లు గ్యాంగ్‌గా ఏర్ప‌డి.. ఈ త‌ర‌హా మోసాలు చేస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకుని.. ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు

మరిన్ని వార్తలు