కిలేడీ.. బ్యాంక్‌లో క్లర్క్‌గా చెప్పుకోని.. రూ. 3కోట్లు వసూలు..

22 Jul, 2021 08:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఖమ్మం: ‘నేను బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాను. మేనేజర్లు అందరూ తెలుసు. రూ.5 వేలు కడితే 20 రోజుల్లో రెట్టింపు డబ్బు వస్తుంది.’అని చెప్పి ఓ మహిళ వందలాది మంది నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ఇది ఆమెపై నమోదైన రెండో కేసు కావడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి.. విజయనిర్మల అనే మహిళ.. తాను ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నట్లు నమ్మబలికింది. వందలాది మంది నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగానే వసూలు చేసిందని సమాచారం.

తొలుత కొందరికి రుణాలు ఇప్పించింది. ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన నాగరాజుతో పాటు మరో నలుగురు తాము విజయనిర్మలకు సుమారు రూ.60 లక్షల మేర చెల్లించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకన్నబాబు తెలిపారు. కాగా, ఆమె భర్తను అదుపులోకి తీసుకోగా తన నుంచి విజయనిర్మల విడిపోయి నాలుగు నెలలు అవుతోందని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఆమెపై గతేడాది కూడా ఓ కేసు నమోదైంది. 

మరిన్ని వార్తలు