కూతురికి పురుగుల మందు ఇచ్చి..

6 Aug, 2020 11:00 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : క‌రోనా నేప‌థ్యంలో ఉపాధి క‌రువై ఆర్థిక ఇబ్బందుల‌తో ఓ కుటుంబం బ‌ల‌య్యింది. కూతురికి  పురుగుల మందు క‌లిపిన  కూల్‌డ్రింక్ తాగించి త‌ర్వాత తండ్రి కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అక్బర్ (48) కుటుంబం కామారెడ్డిలో గోసంగి కాలనీలో నివాసం ఉంటోంది. రోడ్ల‌పై బొమ్మ‌లు, బెలూన్లు అమ్ముతూ జీవ‌నం సాగించేవారు. అయితే క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో తీవ్ర‌మైన ఆర్థిక క‌ష్టాలు ఎదురుకావ‌డంతో మ‌స‌స్తాపం చెందిన అక్బ‌ర్ కూతురు సైరాబేగం(5)కు పురుగుల మందు క‌లిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. త‌ర్వాత తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఐదేళ్ల క్రిత‌మే అక్బ‌ర్ భార్య ఇళ్లు వ‌దిలి వెళ్లిన‌ట్లు స్థానికులు తెలిపారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. 


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా