40 లక్షల దొంగతనం: చివరికి..

14 Nov, 2020 15:47 IST|Sakshi

లక్నో : ప్రజలందరూ దేవుడా ఓ మంచి దేవుడా ఓ బ్యాగ్‌ నిండా నోట్ల కట్టలతో నిద్ర లేచేసరికి ప్రత్యక్షం అయ్యేట్లు కరుణించూ అంటూ ఏదో ఒక సమయంలో కోరుకునే ఉండి ఉంటారు.. అది నిజంగా జరిగితే ఎగిరి గంతేసి సంతోషంగా దాచిపెట్టుకుని, ఉక్కిరిబిక్కిరి అవుతూ నోట్లకట్టలను ఒకటికి రెండు సార్లు లెక్కగట్టుతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ చెందిన ఒక వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. (చదవండి: మహిళ కొంపముంచిన సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్లోని మిషన్‌ కాంపౌండ్కి చెందిన ఒక​ వ్యక్తి బుధవారం నిద్రలేచేసరికి తన ఇంటి పైకప్పు పై రెండు బ్యాగుల కరెన్సీ నోట్లు కనపడటంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతకుముందు రోజు తమ ఇంటి పక్కన ఉన్న వ్యాపారవేత్త ఇంట్లో 40 లక్షల దొంగతనం జరగటంతో, అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారవేత్త ఇంట్లో పనిచేసే నేపాలీ రాజు ఈ దొంగతనానికి పాల్పడినట్లు, ఇందులో సెక్యురిటీగార్డు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఒకరైన నేపాలీ రాజును అరెస్ట్‌ చేశారు. మరొక నిందితుడు సెక్యురిటీ గార్డు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ‌)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా