ఎంత కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అత్మహత్య

8 Jan, 2022 10:30 IST|Sakshi

సాక్షి, కృష్ణ: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా కృష్ణానదిలో తండ్రీ కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గల్లంతైన మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా  దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఆ కుటుంబం సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను తెలంగాణకు చెందిన వారుగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సూసైడ్ కారణాలు తెలుసుకునే పనిలో బెజవాడ పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  ( చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు)

మరిన్ని వార్తలు