కవల పిల్లల హత్య కేసు: వీడిన మిస్టరీ, తండ్రే హంతకుడు

18 Jul, 2021 12:17 IST|Sakshi

తండ్రే పిల్లలకు పాలల్లో విషమిచ్చి చంపాడు..

సాక్షి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. మనుబోలు మండలం రాజోలుపాడులో గత నెల 20న పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తండ్రే పిల్లలకు పాలల్లో విషమిచ్చి చంపినట్లు పోలీసులు తేల్చారు.

భార్యపై అనుమానమే పిల్లల హత్యకు కారణమని విచారణలో వెల్లడైంది. తండ్రి వెంకట రమణయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రే పిల్లలను చంపినట్లు నిర్థారించారు. 

మరిన్ని వార్తలు