ముగ్గురు కూతుళ్లను చైన్‌తో చితకబాదిన తండ్రి  

12 Jul, 2021 09:12 IST|Sakshi
తండ్రి చేతిలో గాయపడిన ఉస్నా  

సాక్షి, గోల్కొండ:  తన ముగ్గురు కూతుళ్లను ఇనుప చైన్‌తో రాక్షసంగా కొట్టి గాయపర్చిన ఓ తండ్రి ఉదంతం గోల్కొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి ఆటో డ్రైవర్‌ ఎజాస్‌ భార్య గౌసియాతో కలిసి గోల్కొండ ధాన్‌ కోటలోని సాలె నగర్‌ కంచెలో ఉంటున్నాడు. వీరికి జైనా (12), ఉస్నా (9), జువేరియా సంతానం. తాగుడుకు బానిసైన ఎజాజ్‌ నిత్య భార్యతో పాటు ముగ్గురు కూతుళ్లను హింసించేవాడు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీ రాత్రి ఎజాజ్‌ఖాన్‌ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో ఘర్షణకు దిగాడు.

వెంటనే ఇనుప చైన్‌ తీసుకుని భార్య గౌసియాను కొట్టడం ప్రారంభించాడు. దెబ్బలు భరించలేని గౌసియా భర్త నుంచి తప్పించుకుని ఇంటి బయటకు వెళ్లింది. దీంతో ఎజాజ్‌ వెంటనే తన ముగ్గురు కూతుళ్లను విచక్షణారహితంగా కొట్టాడు.  కాగా ఉదయం ఇంటికి వచ్చిన గౌసియా పిల్లలు గాయాలతో ఉండటం చూసింది. భర్త ఎజాస్‌ ఖాన్‌ ఇంటి నుంచి పారిపోయాడు. గాయపడిన తన పిల్లలతో గౌసియా బేగం గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు