ప్రజల్లో రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతోంది. రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం అంతమొందిస్తున్నారు. అలాంటి దారుణ ఘటనే నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో జరిగింది. కన్న కూతురినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ తండ్రి. పుట్టింటికి వచ్చిన బిడ్డపై కనికరం చూపకుండా అంతమొందించాడు. భర్తతో గొడవపడిన ప్రసన్న పుట్టింటికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే హత్య చేసిన తండ్రి దేవేందర్ రెడ్డి తల, మొండెం వేరు చేశారు. అత్యంత కిరాతకంగా కన్న కూతురిని హత్య చేయడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దేవేందర్ రెడ్డి కూతురు ప్రసన్నకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని సమాచారం.